Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ప్రేమ పేరుతో మోసం.. ‘జబర్దస్త్’ నటుడు సందీప్‌పై కేసు

ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదుపై ‘జబర్దస్ట్’ నటుడు, గాయకుడు నవ సందీప్‌పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు హైదరాబాద్ లోని మధురానగర్‌ పోలీస్ స్టేషన్‌లో అతనిపై కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. నవ సందీప్‌కు 2018లో ఓ యువతితో పరిచయం అయింది. అది మరింత ముదిరి ప్రేమగా మారింది. విషయం తెలియడంతో యువతి తల్లిదండ్రులు ఆమెను దూరం పెట్టారు.

సందీప్ భరోసాతో ఇంటి నుంచి వచ్చిన యువతి షేక్‌పేటలోని ఆల్‌హమారా కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటోంది. ఈ క్రమంలో ఆమెను పలుమార్లు వశపరుచుకున్నసందీప్ పెళ్లి విషయాన్ని మాత్రం దాటవేస్తూ వస్తున్నాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి తొలుత గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది తమ పరిధి కాకపోవడంతో అక్కడి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మధురానగర్‌ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…!!

RSS
Follow by Email
Latest news