Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం ఐదు కోట్ల నష్టం…

కీర్తి మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం ఐదు కోట్లకు పైగానే ఆస్తి నష్టం ఒంగోలులోని పాత మార్కెట్ సెంటర్లో ఉన్న కీర్తి మెడికల్ షాప్ లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు ఐదు కోట్ల రూపాయలకు పైగానే ఆస్తి నష్టం సంభవించినట్లు నిర్వాహకులు కొలిక్కి వస్తున్నారు. షాపులోని కింద, పైన ఉన్న రెండు అంతస్తుల్లో అగ్ని ప్రమాదం జరిగింది. రెండు అంతస్తుల్లో సుమారు ఏడు కోట్ల రూపాయలకు పైగానే మందుల నిల్వలు ఉన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఉదయం ఆరు గంటల సమయంలో సూపర్వైజర్ శ్రీను షాపు ఓపెన్ చేసేటప్పుడు వెచ్చగా, పొగలు వస్తున్నట్లు గమనించి వెంటనే షాపు ఓనర్ తిరుపతి రెడ్డి కి సమాచారం అందించారు.

ఆ తర్వాత నిర్వాహకులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక జిల్లా ముఖ్య అగ్నిమాపక శాఖ అధికారి ఎస్ వేణుగోపాలరావు తన సిబ్బందితో కలిసి మూడు ఫైర్ ఇంజన్ ల తో అక్కడికి చేరుకొని వెంటనే మంటలను ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసి సఫలీకృతులయ్యారు వెనుక భాగాన ఉన్న డోర్లు కట్ చేసేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. పూర్తిస్థాయిలో షట్టర్ లకు రెండు మూడు తాళాలు ఉండడం వలన వాటిని కట్ చేసేందుకు దాదాపు గంట సమయం పట్టింది.

కీర్తి మెడికల్ షాప్ లో కరెంటు ఓవర్ లోడ్ వలన షార్ట్ సర్క్యూట్ అయినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం ఒంగోలులో ఈ విషయం దావనం లా వ్యాపించడంతో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. జిల్లా ముఖ్య అగ్నిమాపక శాఖ అధికారి ఎస్ వేణుగోపాల్ రావు మాట్లాడుతూ ఉదయం 6:15 గంటలకు ఫోన్ వచ్చింది అన్నారు. వెంటనే మూడు ఫైర్ఇంజన్లు, సిబ్బందితో కలిసి హుటాహుటిన అక్కడికి చేరుకోవడం జరిగిందన్నారు, వెంటనే మంటలను చేశామని, గంటకు పైగా సమయం పట్టింది అన్నారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. ఒంగోలు అగ్నిమాపక శాఖ అధికారి వి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ చాలా పెద్ద ప్రమాదం సంభవించింది అన్నారు వెంటనే మంటలను అదుపులోకి తీసుకు వచ్చామని, లోపల ఉన్న మందులు పూర్తిగా ఖాళీ పోవడం జరిగింది అన్నారు. కీర్తి మెడికల్ షాప్ అధినేత ఎల్ తిరుపతిరెడ్డి మీడియాతో మాట్లాడటానికి ముందుకు రాలేకపోయారు. చాలా బాధ లో ఉన్నారని ప్రస్తుతం ఏమీ మాట్లాడ లేనని చెప్పారు.

RSS
Follow by Email
Latest news