తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఈరోజు ఆ పార్టీ కార్యాలయంలో జరిగింది. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష్లులు శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ… అందరితో కలిసి పనిచేయటం నాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
అలాగే ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం పని చేయాలి అని పేర్కొన్నారు. ఈసందర్బంగా పార్టీ నాయకులు,కార్యకర్తలకు అయన దిశనిర్దేశం చేశారు. ఈ కారిక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు తేలిపారు. ఈ సమావేశంలో డివిజన్ పరిదిలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ నిర్వహణ, సంస్థాగత అంశాలపై చర్చించడం జరిగింది.