ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు వేగం పుంజుకుంది. కెసిఆర్ గారాలపట్టి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రేపు (మార్చి 11) న ఈడీ విచారించనుంది. ఈ నేపథ్యంలో, ఆమె అన్న, తెలంగాణ మంత్రి కేటీఆర్ హుటాహుటీన ఢిల్లీ బయల్దేరారు. అలాగే, బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు, ముఖ్యనేతలు కూడా ఢిల్లీ బయల్దేరారు. కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
