Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తున్న దసరా…!

న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తుంది. మార్చి 30 న విడుదలై సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ భారీ ఓపెనింగ్స్ ని కొల్లగొట్టింది. రిలీజ్ అయిన మొదటి రోజే 38 కోట్లకి పైగా వసూలు చేసింది. తొలి వారంలోనే  55 కోట్ల షేర్, 96 కోట్లకి పైగా గ్రాస్ ని వసూలు చేసింది. సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. తన కెరీర్ లోనే తొలిసారి దర్శకుడిగా తన సత్తాచాటాడు. SLV సినిమాస్ బ్యానర్ లో చెరుకూరి సుధాకర్ ఈ మూవీ ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

కలెక్షన్ల పరంగా ఈ సినిమా 8 రోజుల్లోనే 100 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. 11 రోజుల్లో ఈ సినిమా 60 కోట్లకి పైగా షేర్ వసూలు చేసింది. ఈ సినిమా విడుదలైన 12 రోజుల్లో ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక తాజాగా దసరా సినిమా మరో రికార్డు సృష్టించింది. అది కుడా ఓవర్సీస్ లో రికార్డ్ సృష్టించడం నానికి మరో అచీవ్ మెంట్ అనే చెప్పాలి.  నానికిది మొదటి 2 మిలియన్ డాలర్ల సినిమా. కాగా ఈ సంవత్సరం లో ఇది రెండవ సినిమా. అయితే నాని లాంటి క్లాస్ హీరో ఓవర్సీస్ లో ఒక మాస్ సినిమా తో 2మిల్లియన్లు సాధించడం విశేషం. ఇప్పటికే 110 కోట్లు దాటిన దసరా మూవీ కలెక్షన్ల పరంగా ఇంకెన్ని రికార్డులు తిరగ రాస్తుందో చూడాలి.

RSS
Follow by Email
Latest news
గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి నితిన్ నటించిన సినిమా ట్రైల‌ర్ రిలీజ్.. మీకు ఓటర్ స్లిప్పులు అందలేదా... అయితే ఇలా చేయండి...! దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి.. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు... బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు...! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..! ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్