Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘన విజయం

ప్రపంచంలో అతి పెద్దదైన ప్రజాస్వామ్య గిరిజన మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డ్ సృష్టించారు. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము  గెలిచారు. ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము విజయం సాధించారు. కాగా, విపక్షాల అభ్యర్థిగా బరిలో ఉన్న యశ్వంత్‌ సిన్హా ఓటమి చెందారు. మొదటి రౌండ్‌ నుంచి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉండగా, యశ్వంత్‌ సిన్హా వెనుకంజలో ఉంటూ వచ్చారు.

ఎన్డీయే కూటమి పార్టీలతో పాటు వైసీపీ, అకాలీదళ్, బీజేడీ, బీఎస్పీ పార్టీలు ద్రౌపది ముర్ము కు మద్దతు పలికాయి, దింతో ఎన్డీయే అభ్యర్థి మూడు రౌండ్లలో భారీ ఆధిక్యంలో నిలిచారు. దింతో ద్రౌపది ముర్ము గెలిచినట్లుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి హోదాలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ప్రకటించారు.

అయితే, ఫలితాలు వెల్లడి కాకముందే ఒడిశా రాష్ట్రంలో సంబరాలు చేసుకున్నారు. గిరిజన ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ… నృత్యాలు చేస్తూ… స్వీట్లు పంచు కున్నారు. ద్రౌపది ముర్ము విజయం ఖాయమంటూ ముందుగానే ప్రకటించుకున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 4754 ఓట్లు పోలయ్యాయి. కాగా ఇందులో 4701 ఓట్లు చెల్లగా , 53 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇందులో 2824 ఓట్లు  ద్రౌపది ముర్ము కు మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. వీటి విలువ 6,76,803గా ఉంది. విపక్షాల అభ్యర్థి యాశ్వంత్ సిన్హా కు 1877 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. వీటి విలువ 3,80,177 గా ఉంది.

RSS
Follow by Email
Latest news