Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

దసరా సెలవుల నేపథ్యంలో ప్రత్యేక రైళ్ల వివరాలు…

దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికులతో రైల్వే స్టేషన్ లు అన్ని రద్దీగా ఉంటాయి. ఈనేపథ్యంలో ప్రయాణికుల  రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రత్యేక రైళ్ల వివరాలు ..

  • సికింద్రాబాద్‌ నుంచి యశ్వంత్‌పూర్ (బుధవారం) వెళ్లే 07265 ట్రైన్ 21.45 గంటలకు బయలు దేరి తర్వాతి రోజు 10.50 గంటలకు చేరుకుంటుంది. 28-09-2022 తేదీన ఈ రైలు బయలుదేరుతుంది.
  • యశ్వంత్‌పూర్‌ నుంచి సికింద్రాబాద్‌ (గురువారం) వెళ్లే 07266 నెంబర్‌ రైలు 15.50 గంటలకు బయలు దేరి తర్వాతి రోజు 4.15 గంటలకు గమ్యాన్ని చేరుకుంటుంది. 29-09-2022 తేదీన ఈ రైలు బయలుదేరుతుంది.
  • తిరుపతి నుంచి సికింద్రాబాద్ (ఆదివారం) వెళ్లే 07481 నెంబర్‌ రైలు 21.10కి బయలు దేరి తర్వాతి రోజు 09.30 గంటలకు చేరుకుటుంది. 09-10-2022 తేదీన ఈ రైలు బయలు దేరుతుంది.
  • సికింద్రాబాద్ నుంచి తిరుపతి (సోమవారం) వెళ్లే 07482 నెంబర్‌ రైలు 16.15 గంటలకు బయలు దేరి తర్వాతి రోజు 05.20కి గమ్యాన్ని చేరుకుంటుంది. 10-10-2022 తేదీన బయలుదేరుతుంది.
  • సికింద్రాబాద్‌- యశ్వంత్‌పూర్‌ – సికింద్రాబాద్‌ రైలు కాచిగూడ, ఉమాద్‌నగర్‌, షాద్‌ నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌ నగర్‌, వనపర్తి, గద్వాల్‌, కర్నూల్‌ సిటీ, ధోన్‌, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్‌, ఎలకం స్టేషన్‌లలో ఆగుతుంది.
  • ఇక తిరుపతి – సికింద్రాబాద్‌ – తిరుపతి రైలు రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్‌, మంత్రాలయం, రాయ్‌చూర్‌, తాండూర్‌, వికారాబాద్‌, లింగంపల్లి, బేగంపేట్‌ స్టేషన్స్‌లో ఆగుతుంది.
RSS
Follow by Email
Latest news