Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మూగబోయిన గులాబీ దళం…!

‘లిక్కర్ స్కాం’ బట్ట బయలయింది. రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు బయటకు వచ్చింది. ఈ మధ్య కాలంలో కల్వకుంట్ల కుటుంబం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇదే ! ప్రస్తుతం ఆ కుటుంబం గందరగోళంలో ఉన్నట్లు సమాచారం. గులాబీ పార్టీ శ్రేణులన్నీ ఒక్కసారిగా కంగుతిన్నాయి. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తున్న గులాబీ బాస్. ఇక జరగబోయేదంతా చట్టప్రకారం జరిగే ప్రక్రియే… కామన్ గా నడిచే తంతే..కానీ అది ఎప్పుడు..? ఏ విధంగా జరగబోతుందనేదే ఆసక్తికరం సస్పెన్స్.

అమిత్​ అరోరా రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు..

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు.  32 పేజీల రిమాండ్ రిపోర్టులో కవిత పేరు మూడు సార్లు ప్రస్తావనకు వచ్చింది. రిమాండ్ రిపోర్టు ప్రకారం రూ. 100 కోట్ల ముడుపులు చేతులు మారాయి. ఆమ్​ ఆద్మీ పార్టీకి కమీషన్ల కోసమే ఢిల్లీ లిక్కర్ పాలసీలో అత్యధికంగా మార్జిన్ పెట్టారని అందులో ఆరోపించారు. ఆమ్​ ఆద్మీ పార్టీ తరఫున విజయ్ నాయర్ 100 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు చెప్పారు.

ఇంతకీ ఈ అమిత్​ అరోరా ఎవరు..?

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుల్లో అమిత్ అరోరా ఒకరు. గురుగ్రామ్ కు చెందిన అమిత్ అరోరా బడ్డీ రిటైల్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మద్యం వ్యాపారి అమిత్ అరోరాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సిసోడియాకు అర్జున్ పాండే, దినేశ్ అరోరా, అమిత్ అరోరా అత్యంత సన్నిహితులు కాగా.. వీరిలో దినేశ్ అరోరా సీబీఐ కేసులో అప్రూవర్గా మారాడు. అధికారులు అతడి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు.

కొద్ది రోజుల్లో మరిన్ని అరెస్టులు..? అందులో కవిత ఉంటుందా.?

రిమాండ్ రిపోర్టు ఆధారంగా కొన్ని కేసులలో అరెస్టులు జరుగుతాయి. ఈ కేసులో మాత్రం లావాదేవీలు కీలకంగా మారనున్నాయి. 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో ఎవరికి.? ఎంత.? ఏవిధంగా..? అన్నదే ముఖ్యం. ఈ కేసులో మొత్తం 36 మంది ఉన్నట్లు తెలిసింది. ఈ స్కాంలో మరికొద్ది రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉండవచ్చునని సమాచారం. అయితే, అందులో కవిత ఉంటుందా.? లేదా.? అన్నది భవిష్యత్తులో తెలియనుంది.

RSS
Follow by Email
Latest news