స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26న కోటి మొక్కలు నాటనున్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాల్టీల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, అలాగే వివిధ ప్రజా సంఘాలు, సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వాములుగా చేయాలని కలెక్టర్లకు సూచించారు. సంక్షేమ పథకాల పురోగతిపై జిల్లా కలెక్టర్లతో శుక్రవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణకు హరితహారం, దశాబ్ది సంపద వనాలు, స్వతంత్ర భారత వజ్రోత్సవం సందర్భంగా కోటి మొక్కలు నాటడం, రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ సమీక్షించారు. నోటరీ భూముల క్రమబద్ధీకరణ, వీఆర్వోల క్రమబద్ధీకరణపై ఆరాతీశారు. వివిధ జిల్లాల్లో 1266 మందికి కారుణ్య నియామకాలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
