Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కామారెడ్డి జిల్లాలో నేడు పర్యటించనున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఉదయం 10గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లా పర్యటనకు బయల్దేతారు. 10.40గంటలకు బాన్సువాడకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా  బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌లోని తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. ఆలయంలోని శ్రీదేవి,భూదేవి సమేత వెంకటేశ్వరస్వామికి కల్యాణోత్సవాన్ని తిలకిస్తారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం తిరిగి మధ్యాహ్నం 1.30నిమిషాలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

RSS
Follow by Email
Latest news