నటసింహం నందమూరి బాలకృష్ణ ఆరోగ్యం పై వస్తున్నా వదంతులను నమ్మవద్దని ఆయన ఒక ప్రకటనలో కోరారు. ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కొరకు మాత్రమే హాస్పిటల్ కి వెళ్లడం జరిగిందని అందులో పేర్కొన్నారు. నిన్న ఆయన సారధి స్టూడియోస్ లో #NBK107 షూటింగ్ లో కూడా పాల్గొన్నారని ఎన్.బి.కె టీమ్ తెలిపింది. బాలయ్యకు ఆరోగ్యం బాగాలేదని జరుగుతున్న ప్రచారం ఒట్టి పుకారు మాత్రమే అన్నారు. దయచేసి అవాస్తవాలను ప్రచురించవద్దని, వ్యాప్తి చేయవద్దని ఒక ప్రకటనలో కోరారు.
