పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ముస్లిం సోదరులతో కలిసి ఆమె ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. కోల్ కతాలోని రైన్ డ్రెంచ్డ్ రెడ్ రోడ్ లో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్ ప్రార్థన కార్యక్రమంలో దాదాపు 14 వేల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పశ్చిమబెంగాల్ లో మతాల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. మతసామరస్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ పశ్చిమబెంగాల్ మాత్రమేనని అన్నారు. ఏకత్వం అనేది బెంగాలో ఉందని… దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లో ఇది కనిపించదని అన్నారు. అందుకే తృణమూల్ కాంగ్రెస్ అంటే బీజేపీకి నచ్చదని బీజేపీపై నిప్పులు చెరిగారు. దేశంలో ప్రస్తుత పాలిటిక్స్ , విభజించి పాలించే రాజకీయాలు దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నాయని ఆరోపించారు.