భాజపా, భారాస రెండూ మిత్రపక్షాలేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేవీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన సభకు ముఖ్యఅతిథిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరైనారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ… తెలంగాణ కోసం అన్ని వర్గాల వారు పోరాటం చేస్తే.. క్రెడిట్ అంతా ఒకే వ్యక్తి తీసుకున్నారని ఖర్గే విమర్శించారు. “కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడి ప్రజల మనసు తెలుసుకొని సోనియా తెలంగాణ ఇచ్చారని వివరించారు. కానీ, తనవల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ ఇప్పుడు చెబుతున్నారు.అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. 53 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో దేశాన్ని బలోపేతం చేశాం. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెసేతర ప్రభుత్వాలు దేశానికి ఏం చేశాయి? మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేస్తాం” అని ఖర్గే వెల్లడించారు. ప్రజాగర్జన సభకు పార్టీ నాయకులతోపాటు, భారీ స్థాయిలో కార్యకర్తలు తరలివచ్చారు.
