Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

అక్కినేనిపై స్పందించిన బాలకృష్ణ

వీరసింహారెడ్డి చిత్రం విజయోత్సవ సభలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం పట్ల నందమూరి బాలకృష్ణ తొలిసారిగా స్పందించారు. ఆ రంగారావు ఈ రంగారావు… ఆ అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీయడం తెలిసిందే. దీనిపై ఇప్పటికే అక్కినేని కుటుంబం నుంచి నాగచైతన్య ఘాటుగానే విమర్శించారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ వివరణ ఇచ్చారు. తాజాగా అయన మీడియాతో మాట్లాడుతూ, తాను ఏదో ఫ్లోలో అన్నానని, అక్కినేని నాగేశ్వరరావును బాబాయ్ గా భావిస్తానని బాలకృష్ణ  వెల్లడించారు.

బాబాయ్ పట్ల నా గుండెల్లో ప్రేమ ఉంది… బయట ఏవో అంటుంటారు… అవన్నీ నేను పట్టించుకోను అని స్పష్టం చేశారు. ఆయన తన పిల్లల కంటే నన్ను ఎక్కువగా ప్రేమగా చూసుకునేవారని, నన్ను చాలా ఇష్టంగా చూసుకునేవారని బాలయ్య వెల్లడించారు. “ఎన్టీఆర్, ఏఎన్నార్ లను అభిమానంతో ఎలా పిలుస్తారో తెలిసిందే కదా… రామారావును అభిమానంతో ఎన్టీవోడు అంటారు. ఏఎన్నార్ ను నాగిగాడు అంటారా లేదా…! అభిమానంతోనే అలా అంటారు. నేను ప్రచారానికి వెళ్లినప్పుడు నాకు కూడా ఇలాంటి మాటలు ఎదురవుతుంటాయి.

మనకు ఆప్తులైన వాళ్ల గురించి మనం కూడా అభిమానంతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం. ఒక్కోసారి మనం తాడో పేడో అని అంటుంటాం… అందులో పేడు అంటే అర్థం ఏంటి? ఏవో మాటలు కొన్నిసార్లు అలా వచ్చేస్తాయి. వాటిని తప్పుపడితే ఎలా? ప్రేమకొద్దీ అన్న మాటలను కూడా దుష్ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు” అని బాలకృష్ణ వివరించారు.
RSS
Follow by Email
Latest news