ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను హైదరాబాదులోని ఆయన నివాసంలో కాసేపటి క్రితం అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను ఏపీకి తరలించారు. ఆయన వెంట ఆయన భార్య రమాదేవి కూడా ఉన్నారు. నారాయణ విద్యాసంస్థలు ఏపీలో పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ చేశారంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలే పేపర్ లీక్ చేశాయంటూ…సీఎం జగన్ నేరుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో నారాయణపై చిత్తూరులో కేసు నమోదయింది. ఈనేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఆయనను అదుపులోకి తీసుకున్నారని కుటుంబసభ్యులు చెపుతున్నారు.
