Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

యాదాద్రి టెంపుల్ కి వెళుతున్నారా…? ఇది తెలుసుకుని వెళ్ళండి..

యాదాద్రి టెంపుల్ పున : ప్రారంభం అయ్యింది. అయితే మీరు దైవదర్శనం కోసం యాదాద్రికి వెళుతున్నారా…? అయితే ఇది ఒకసారి తప్పకుండ చదవండి. లేదంటే మీరు నిజంగానే నిలువుదోపిడికి గురవడం మాత్రం ఖాయం. ఆలయ నిర్మాణానికి అయిన ఖర్చు మొత్తం మొదటి సంవత్సరంలోనే వాసులు చేసేటట్లు ఉన్నారు అక్కడి అధికారులు. టెంపుల్ పున : ప్రారంభం కావడం తో దైవ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా శని , ఆదివారాల్లో భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది.

ఇదే అదునుగా భక్తులపై ఆలయ సిబ్బంది బాదుడు మొదలుపెట్టారు. యాదగిరి గుట్టపై వాహనాల పార్కింగ్ పేరుతో భక్తులను నిలువు దోపిడి చేసేందుకు డిసైడ్ అయ్యారు. కొండపై వాహనం పార్క్‌ చేస్తే గంటకు రూ.500, ఆ తర్వాత ప్రతి గంటకు రూ.వంద చొప్పున వసూలు చేయాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో తెలపడం పలు విమర్శలకు దారితీస్తుంది.

కేసీఆర్ కేటీఆర్ లకు కనపడటం లేదా..?

నిత్యం పక్కరాష్ట్రాలతో పోల్చుకునే కేసీఆర్ కేటీఆర్ లకు ఇది కనపడటం లేదా అని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమల కొండపైకి నిత్యం వేలకొద్దీ వాహనాల్లో కొండపైకి వచ్చే విషయం తెలిసిందే… అలంటి   స్థలంలోనే ఒక్క రూపాయి కూడా వాసులు చేయకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరి తెలంగాణ తిరుపతిగా చెప్పుకునే తండ్రి కొడుకులు ఈ విషయంలో ఎందుకు పోల్చుకోవడం లేదని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు.

భక్తిని కమర్షియల్ గా చూడవద్దు : భక్తురాలు 

దైవ దర్శనానికి వచ్చే భక్తులను ఆలయ కమిటీ కమర్షియల్ గా చూడకూడని, ఇది కేవలం సేవాదృక్పదం తో చూడాలని హన్మకొండకు చెందిన భక్తురాలు బన్న శుభ అన్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులపై ఇలా అధిక భారం మోపడం సరైన నిర్ణయం కాదని ఆమె పేర్కొన్నారు. తిరుపతి లో లాగా ఉచితంగా కాకున్నా ఎదో కొద్ది మొత్తంలో వసూలు చేస్తే బాగుండేదని అన్నారు. గుట్టపైన పార్కింగ్ ఎంట్రీ టికెట్ రూ. 500 పెట్టి ఆపైన ప్రతి గంటకు రూ. 100 వాసులు చేయడం అనేది ఆక్షేపణీయం అన్నారు.

ఇలాంటి నిర్ణయం తో స్వామి వారిని మనస్ఫూర్తిగా దర్శించుకోవాలా వద్దా…? అసలు ఇక్కడికి భక్తులు రావాలా వద్దా ..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. దైవ దర్శనానికి గంటకు పైగా సమయం పడితే అప్పుడేంటి సంగతి అని ఆరోపిస్తున్నారు. కనీసం ఆప్రాంగణం అంతా కలియదిరిగి వస్తే మరో రెండు గంటలు పెట్టిందనే…ఎంత చెల్లించాలి. కేవలం పార్కింగ్ కే వెయ్యి రూపాయలు యితే, ఇక క్కడ ఏమి షాపింగ్అ చేస్తాం…? ఏమి దర్శం అవుతుందని  వాపోతున్నారు.

యాదాద్రిలో పార్కింగ్ పేరుతో నిలువుదోపిడీ…

యాదగిరి గుట్టపై వాహనాల పార్కింగ్ పేరుతో భక్తులను నిలువు దోపిడి చేసేందుకు ఆలయ అధికారులు సమాయత్తం అయ్యారు. పార్కింగ్ చేసే వాహనాలకు భారీ స్థాయిలో పార్కింగ్ రుసుం పెంచేశారు. కొత్తగా నిర్ణయించిన ఈ ఛార్జీలు ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఉద్యోగులు, మీడియాకి మాత్రమే కొండపైన ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతోపాటు ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులకు ప్రోటోకాల్ ప్రకారం వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. అయితే ఆలయ కమిటీ ప్రకటించిన తాజా ధరలపై భక్తులు మండిపడుతున్నారు. దైవ దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే భక్తులను నిలువుదోపిడీ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

RSS
Follow by Email
Latest news
గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి నితిన్ నటించిన సినిమా ట్రైల‌ర్ రిలీజ్.. మీకు ఓటర్ స్లిప్పులు అందలేదా... అయితే ఇలా చేయండి...! దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి.. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు... బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు...! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..! ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్