Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఏపీలో పురుడుపోసుకున్న మరో కొత్త పార్టీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంది. ‘జై భీమ్ భారత్ పార్టీ’ పేరుతో విజయవాడలో నిన్న సాయంత్రం జడ శ్రవణ్‌కుమార్ పార్టీని ప్రారంభించారు. ఈ మేరకు పార్టీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ.. ఓడిపో, ఓడించు, గెలువు అన్న కాన్షీరాం మాటలే తనకు స్ఫూర్తి అని శ్రవణ్ కుమార్ అన్నారు. అధికార వైసీపీలోని దళిత నేతల పనిపట్టేందుకు తాను ఈ పార్టీని ఏర్పాటు చేయునట్లు తెలిపారు. దళితులకు అన్యాయం జరుగుతున్నా ఖండిచపోవడం… వారి సామజిక వర్గానికి వారు చేస్తున్న మోసాలను బట్టబయలు చేస్తానన్నారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో వారిని ఓడించడమే తన లక్ష్యం అన్నారు.

దళితులకు అందే 26 రకాల పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రూపాయికి కిలో బియ్యం, రూ. 200కు నూనె ప్యాకెట్ ఇచ్చే వారిని పొగుడుదామా? అని ప్రశ్నించారు. ప్రజలకు అన్యాయం చేసే వారిని ప్రశ్నించకుండా వదలనని శ్రవణ్ కుమార్ తేల్చిచెప్పారు. దళితులకు జరుగుతున్నా అన్యాయాలను చూస్తూ ఉరుకోలేకనే తాను కొత్త పార్టీని స్థాపించినట్లు శ్రవణ్ కుమార్ తెలిపారు. తాను 28 28 సంవత్సరాలకే న్యాయమూర్తిని అయ్యాయని, సమాజంలో దళితులకు జరుగుతున్నా అన్యాయాలను చూడలేకనే తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గ పాలనను ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

RSS
Follow by Email
Latest news