Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

చీలిక దిశగా అన్నాడీఎంకే..!

తమిళనాట రాజకీయ వర్గ విబేధాలతో అన్నాడీఎంకే రెండు ముక్కలుగా చీలిపోయే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం పన్నీరు సెల్వం తాత్కాలిక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకేను తన గుప్పెట్లో పెట్టుకోవాలని నిచ్చెలి శశికళ వేసిన ఎత్తుగడలని ఆ పార్టీ సీనియర్ నేత, తాత్కాలిక ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అడ్డుకోవడంతో తమిళనాట రాజకీయ వేడి రాజుకుంది. ఒక్కసారిగా క్యాంప్ రాజకీయాలకు తెరలేసింది.

జయలలితకు నమ్మకస్తుడైన పన్నీరు సెల్వం ను పదవీచ్యుతుణ్ణి చేసేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను రిసార్ట్ కు తరలించించి క్యాంపు రాజకీయాలకు శశికళ శ్రీకర చుట్టారు. తానే ముఖ్యమంత్రిని కావాలని, ఎమ్మెల్యేలు అందరిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. పన్నీరు వైవు ఎవరు వెళ్లనుకుండా తన రాజకీయ చతురతతో  మెజార్టీ ఎమ్మెల్యేలను సంపాదించుకోగలిగారు.

కానీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుతో తాను అనుకున్నది సాధించలేకపోయారు. పదవి దక్కకపోయేసరికి ఆఒకింత అసహనానికి గురైన ఆమె చివరకు జైలుపాలు అయ్యారు. అయినా అన్నాడీఎంకే పై తన మరుకును చాటుకున్నారు. పన్నీరు సెల్వం ను పదవీచ్యుతుణ్ణి చేసి తనకు నమ్మకస్తుడైన పళనిస్వామికి మాముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి. ఆమె జైలుపాలు అయ్యారు.

ఆతరువాత పాలని, పన్నీరు వర్గాలను ఒకటి చేసేందుకు కేంద్రం లోని బీజేపీ ప్రభుతం రంగంలోకి దిగి, వారి మధ్య సయోధ్య కుదిర్చడం జరిగింది. జైలు నుండి విడుదలైన శశికళను ఈ రెండు వర్గాలు కలిసి పక్కన పెట్టేశాయి. కానీ తాజాగా పళని స్వామి, పన్నీరు సెల్వం ఇద్దరు పార్టీపై తమతమ పట్టు కోసం రెండు వర్గాలుగా విడిపోయారు. ఇంతకాలం అధికారంలో ఉన్న పళని స్వామి కి పార్టీలో పట్టు ఉండటంతో పన్నీరు సెల్వం కూడా ఆదిశగా తన మద్దతు దారులతో పార్టీలో తన మార్కును చూపించే ప్రయత్నం చేశారు. దింతో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు.

నిన్న జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో అన్నాడీఎంకే సమన్వయకర్తల పదవులను రద్దు చేయడంతోపాటు పన్నీర్ సెల్వం, ఆయన మద్దతుదారులను పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. ‘‘మీరెవరు నన్ను తొలగించడానికి.. నేనే మిమ్మల్ని బహిష్కరిస్తున్నాఅంటూ అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వం. ఇలా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలైనాయి. ఈ క్రమంలో  తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామిని ఎన్నుకున్నారు.

తనను పార్టీ నుంచి తొలగిస్తూ తీర్మానం చేయడంపై పన్నీర్ సెల్వం తీవ్రంగా స్పందించారు. తనను తొలగించేందుకు పళనిస్వామి ఎవరని ప్రశ్నించిన ఆయన.. తానే పళనిస్వామిని, సీనియర్ నేత కేపీ మునుస్వానిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు చెప్పారు. పార్టీకి తానే సమన్వయకర్తనని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు వారిద్దరినీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. న్యాయం కోసం మళ్లీ కోర్టుకెళ్తానని చెప్పారు. నిజంగానే అయన కోర్టుకు వెళితే తీర్పు ఎలా వస్తుందో…పార్టీ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

  • బన్న ప్రభాకర్, సీఎండీ,  ఏపీటీఎస్ బ్రేకింగ్ న్యూస్.
RSS
Follow by Email
Latest news