Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తిరుమలలో రేపటినుంచి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం..!

జూన్ 1 నుంచి తిరుమల కొండపై ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేదిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఇకనుండి ప్లాస్టిక్ రహిత వస్తువుల్ని మాత్రమే అనుమతిస్తామన్నారు. షాంపులు కూడా తిరుమలలో నిషేదిస్తున్నట్లు తెలిపారు. కొండ‌పైకి ఎలాంటి ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను అనుమతించ‌ని విధంగా నిఘా పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందుకోసం అలిపిరి టోల్ గేట్ వ‌ద్ద ప్లాస్టిక్‌ను గుర్తించే సెన్సార్ల‌తో నిఘా పెంచ‌నున్న‌ట్లు తెలిపింది.

అంతేకాకుండా కొండ మీద వ్యాపారం చేస్తున్న వారు కూడా ప్లాస్టిక్‌కు ప్ర‌త్యామ్నాయాల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించింది. తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం విధిస్తున్నందున కొండపైన వ్యాపారు చేస్తున్న వారు, దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు ప్లాస్టిక్ కవర్స్ వాడితే సీజ్ చేస్తామని తెలిపారు. అలాగే తిరుమలలో దుకాణదారులు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఈ మార్పును గమనించి భక్తులు, దుకాణదారులు తమకు సహకరించాలని టీటీడీ కోరింది.

RSS
Follow by Email
Latest news