Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రేపు విష్ణువర్ధన్‌ రెడ్డి ఇంట్లో సీనియర్ల ప్రత్యేకంగా భేటీ..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో నేతల మధ్య విభేదాలు అనేవి కొత్తేమి కాదు..ఈ మధ్య కాస్త సద్దుమణిగినట్లు అంత అనుకున్నారో లేదో..మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఇప్పటికే తూర్పు జగ్గారెడ్డి రేవంత్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు రావడంతో పంచాయతీ మొదలైంది. చివరికి ఎక్కడి వరకు పోతుందో ఎవ్వరికి అర్ధం కానీ పరిస్థితి. పీసీసీ ప్రసిడెంట్ హైదరాబాద్ లేని సమయంలో రేపు పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌ రెడ్డి ఇంట్లో సీనియర్లు ప్రత్యేకంగా భేటీ కాబోతుండడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ భేటీ లో ఎవరు ఏమి మాట్లాడనున్నారనే చర్చ తెరమీదకు వచ్చింది. ఈ భేటీలో మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు వీహెచ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, నిరంజన్‌ సహా 15 మంది హాజరుకాబోతున్నట్లు సమాచారం. కొంతకాలం నుంచి పార్టీకార్యకలాపాలకు దూరంగా ఉంటున్న జూబ్లీహిల్స్‌ మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి నిన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిశారు. ఆ తర్వాత పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీతో విష్ణు సమావేశం కాగా..ఆయా భేటీల్లో ప్రస్తుత పీసీసీ తీరుపై అసంతృప్తి వ్యక్తమైనట్టు తెలుస్తోంది. ఈ తరుణంలోనే రేపు భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ భేటీలో సీనియర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

RSS
Follow by Email
Latest news