Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెలంగాణాలో జిల్లాకు ఒక మెడికల్ కళాశాల : బోయి వినోద్ కుమార్

ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 5 మెడికల్ కళాశాలలు ఉండేవి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాకు ఒక మెడికల్ కళాశాలు ఏర్పాటు చేసుకుంటున్నామని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయి వినోద్ కుమార్ అన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి రాష్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. బిమారంలో ఎస్ వి ఎస్ కళాశాలలో నిర్వహించిన స్ప్రింగ్ ఫైర్ 2022 టెక్నీకల్ కల్చరల్ కార్యక్రమానికి హాజరైనారుఈసందర్బంగా అయన మాట్లాడుతూ….. ప్రత్యేక తెలంగాణ కోసం 2దశాబ్దాల పోరాట ఫలితమే నేడు24గంటకు కరెంట్ ఉందని విద్యార్థులకు దశదిశ నిర్దేశం చేశారు.

మనకు బొగ్గు ఉత్పత్తి ఉంటుంది కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ లేకుండా ఉండేదని వివరించారు. అలాగే మన బొగ్గును మహారాష్ట్ర, కర్ణాకట, ఇతర రాష్ట్రాల కు తరలించే వారని అయన ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి గా కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రం విడిపోతే కరెంట్ కష్టాలు ఉంటాయని తెలంగాణ ను అవహేళన చేసారని గుర్తు చేశారు. ఇప్పుడు మన బొగ్గుతో కరెంట్ ఉత్పత్తి చేసుకుని రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ ని  ఉత్పత్తి చేసుకుంటున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ తిరుమలరావు,అనూప్, సువర్ణ, హర్షిణి ,అధ్యాపకులు విద్యార్థులు, పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news