Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

శ్రీశైలంలో ఒక అద్బుత ఆలయం… ఆ వివరాలు…

👉 శ్రీశైలంలో ఒక అద్బుత ఆలయం ఉందా..?
👉 బొట్టు పెడితే కోరిన కోరికలు నెరవేరుతాయా..?
👉 అమ్మవారిని తాకితే మనిషి శరీరంలాగ_మెత్తగ ఉందా..?
👉 చంద్రోదయం వెళకి అమ్మవారు రంగులు మారతారా…?

శైలపుత్రి దేవాలయం ఈ ఆలయం ఈ ఆలయంని ఇష్టకామేశ్వరి ఆలయం అని కూడ పిలుస్తారు, అదొక చిన్న గుహా మాదిరి ఉంటుంది, ఆగుహలో పద్మాసనంలో కూర్చుని ఉన్న అమ్మవారి విగ్రహం చతుర్బుజాలతో ఉంటుంది, మాశ్రీకే అనే గురువు అక్కడకి వెళ్ళినప్పుడు ఆ తల్లి చంద్రోదయం సమయానికి రంగులు మారేదట, కుంకుమ వర్ణం లో బంగారు వర్ణంలో అలా ఈమద్య కనపడటం లేదు, అదెంటి అప్పుడు జరిగింది కదా ఇప్పుడు ఎందుకు జరగదు అంటారేమో,

ఒకప్పుడు వెంకటేశ్వర స్వామివారి విగ్రహం నుండి వాక్కు వినిపించేదని తాళపత్రగ్రంధలలో వ్రాయబడింది, మరి ఇప్పుడు మాటాడం లేదే, అప్పుడు తొండమాన్ చక్రవర్తి ఎదో తప్పు చేసారని దానివలన స్వామి వాక్కు వినిపించడం లేదని చెబుతారు, అదేవిదంగ అమ్మవారు ఇప్పుడు రంగులు మారడం లేదు కాని ఆ విగ్రహానికి ఒక అద్బుతమైన శక్తి  ఉంటుందని అంటారు. ఎవరైనా సరే ఆ తల్లికి బొట్టు పెట్టి పొంగలి నైవేద్యంగ పెట్టి కోరిక కోరుకుంటే ఆకోరిక  నెరవేరుతుందని పెద్దలు చెపుతుంటారు. అలా చాల మందికి అనుభవాలున్నాయట. అలా ఇష్టకామ్యాలను తిరుస్తుంది కాబట్టి ఆ తల్లిని ఇష్టకమేశ్వరి అని పిలుస్తున్నారు,

ఆ తల్లిని చూస్తే ఒక చేతిలో శివలింగం ఉంటుంది. ఒక చేతిలో రుద్రాక్ష మాల ఉంటుంది, మిగత రెండు చేతులలో కమలాలు ఉంటాయి, అమ్మవారు శివుడిని వివాహం చేసుకోవడం కోసం తపస్సు చేశారని, అందుకే శైలపుత్రి అని అలా తపస్సు చేసిన స్వరూపమే ఈ అమ్మ అంటుంటారు. ఆ తర్వాత పరమేశ్వరుడిని మెప్పించి కల్యాణం చేసుకుని, బూడిదైన మన్మదుడిని బ్రతికించిందని పురాణాలూ చెపుతున్నాయి.

అలాగే బూడిదైపోయిన మన ఆశలని కూడా ఆ అమ్మ కి బొట్టు పెట్టి కోరుకుంటే తప్పక_నెరవేతుంది, అది శిలారూపమే అయినప్పటికి అమ్మ నుదురు బాగం ఆ శిల్పంలో మనిషి నుదురు మాదిరి మెత్తగ ఉంటుందంట, అది అక్కడ విశేషం. అక్కడకి వెళ్లలిగే వారు వెళ్ళండి. వెళ్లలేని వారు అమ్మని ఇంట్లో ఫోటోలో దర్శించి ఈ శ్లోకాలు చదువుకొండి,

👉 ఇష్టకామేశ్వరి – స్తుతి

మహాకాళీ మహాలక్ష్మీ మహా సరస్వతీ ప్రభా
ఇష్ట కామేశ్వరీ కుర్యాత్ విశ్వశ్రీ విశ్వమంగళ

షోడశి పూర్ణ చంద్రప్రభా మల్లిఖార్జున గేహిని
ఇష్ట కామేశ్వరి కుర్యాత్ జాగాన్నీ రోగ శోభనం

జగద్దాత్రీ లోకనేత్రి సుధా నిష్యందీ సుస్మితా
ఇష్ట కామేశ్వరి కుర్యాత్ లోకం సద్బుద్ధి సుందరం

పరమేశ్వరవాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా
ఇష్ట కామేశ్వరి కుర్యాత్ మాంగాల్యనంద జీవన

RSS
Follow by Email
Latest news