ప్రభుతాలకు, ప్రజలకు మధ్య వారధిగా నిలిచే వాడు జర్నలిస్ట్. ప్రజలకు ఏ సమస్యలు వచ్చిన ఇటు ప్రభుత్వానికి, అటు అధికారులకు అందరికి తెలిసేలా తన వార్త కథనాలతో మీడియా ద్వారా అందరిని అప్రమత్తం చేస్తుంటారు. అందులో భాగంగానే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సంబందించిన న్యూస్ అప్డేట్స్ అందించేందుకు కరీంనగర్ కు చెందిన ఓ జర్నలిస్ట్ ఇలాగే, న్యూస్ కవరేజ్ నిమిత్తం వెళ్ళి, వరదల్లో చిక్కుకుని గల్లంతైన ఘటన అందరిని దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.
వివరాల్లోకి వెళితే… రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామం వద్ద 9 మంది వ్యవసాయ కూలీలు గోదావరి నదిలో చిక్కుకోగా, ఆ వార్త కవర్ చేసేందుకు ఎన్టీవీ రిపోర్టర్ జమీల్ వెళ్ళారు. అనూహ్యంగా ముంచుకొచ్చిన వరద కారణంగా జమీర్ తన వాహనంతోపాటు నదిలో కొట్టుకుపోయాడు. గల్లంతయిన జర్నలిస్టుని కనుగొనేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని అందరూ ఆశిస్తున్నారు.