బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ రాజీనామాతో ఖాళీ అయిన ఆ పదవికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన నేత రిషి సునక్ బ్రిటన్ ప్రజలను, కన్జర్వేటివ్ పార్టీ నేతలను బాగా ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాని పదవికి పోటీలో భాగంగా రిషి సునాక్ తన కుటుంబంతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తన భార్య, అక్షతామూర్తి, ఇద్దరు కుమార్తెలు కృష్ణ, అనౌష్కలతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
తన ప్రచారంలో భాగంగా గ్రాంథమ్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అయన మాట్లాడుతూ… నా వెంట నిలిచిన నా కుటుంబానికి కృతజ్ఞుడిగా ఉంటాను. సమగ్రత, కలిసి ఉండటం, కష్టించి పనిచేయడం, కుటుంబానికి విలువ ఇవ్వడాన్ని నేను నమ్ముతాను..” అని రిషి సునక్ ప్రకటించారు. ఈ క్రమంలో ఇదంతా ‘‘నాకు నా కుటుంబమే అంటూ…తన భార్య ఇద్దరు పిల్లలతో కూడిన ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు పెట్టారు.