ఏపీ కోటాలోని 4 రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు వేణుంబాక విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ 4 నామినేషన్లే వచ్చాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. అదే సమయంలో 4 నామినేషన్లు కూడా నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనున్నదని, ఆ గడువు ముగిశాక వీటిపై ఓ ప్రకటన చేయనున్నట్లు తెలిపింది. 4 స్థానాలకు 4 నామినేషన్లే దాఖలైన నేపథ్యంలో వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
