అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. నయనతార కథానాయిక. వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. జనవరి 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రంలో ‘హుక్ స్టెప్’ సాంగ్‌ను విడుదల చేశారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఈ సాంగ్‌ను రిలీజ్ చేయగా, అభిమానులే కాదు, వెంకటేశ్, అనిల్ రావిపూడి కూడా ఈ పాటకు డ్యాన్స్ వేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చిన ఈపాటను బాబా సెహగల్ ఆలపించారు. ఇప్పటివరకూ ఈ చిత్రం నుంచి వచ్చిన పాటల్లో ఇదే హైలైట్ కావడం గమనార్హం. అంతేకాదు, సోషల్‌మీడియాను కూడా ఓ ఊపు ఊపేయడం ఖాయంగా కనిపిస్తుంది.











