ఆంధ్రప్రదేశ్ లో వచ్చే డిసెంబర్ నెలలో ఎన్నికలు రావొచ్చునని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ ఎన్నికల్లో పొత్తు కచ్చితంగా ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన పార్టీ మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ భవిష్యత్తు కోసం అలయెన్స్ తప్పనిసరి అని, పొత్తుకు నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు.
జూన్ నుండి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుడతానని తెలిపారు. తనను ముఖ్యమంత్రి అని నినాదాలు ఇచ్చేవారికి ఒకటే చెబుతున్నానని, జనసేనకు 48 శాతం ఓటింగ్ ఇస్తే, అప్పుడు నేనే సీఎం అవుతానని స్పష్టం చేశారు. కానీ అంత ఓటు రానప్పుడు సీఎం పదవిని మనం ఎలా అడగగలమని ప్రశ్నించారు.