Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

భారత ఏకైక నటుడుగా ప్రభాస్ రికార్డ్

మరో కొన్ని గంటల్లో రాజాసాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దింతో సోషల్ మీడియాలో ప్ర‌భాస్ అభిమానుల సందడి మొదలైపోయింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజ‌ర్‌, ట్రైల‌ర్, సాంగ్స్ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. సంక్రాంతి సీజ‌న్లో మొట్టమొద‌టిగా ప‌ల‌క‌రించ‌బోతున్న సినిమా ఇదే. ఈ రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్లతో రాజాసాబ్ రచ్చ షురూ కానుంది. అటు ఆంధ్ర, కర్ణాటక, ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు.

కాగా ఓవర్సీస్ లో రెబెల్ సాబ్ రికార్థులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ స్టార్ట్ కానున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొట్టింది. నార్త్ అమెరికాలో ఏకంగా 1మిలియన్ డాలర్స్ కు పైగా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో మరొక రికార్డ్ కూడా తన పేరిట రాసుకున్నాడు రెబల్ స్టార్. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ లో హ్యాట్రిక్ 1M$ ప్రీమియర్లు సాధించిన ఏకైక భారతీయ నటుడుగా రికార్డులకెక్కాడు రెబల్ సాబ్. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలలో తన స్టామినా ఏంటో చూపిస్తూ దూసుకెళ్తున్నాడు. ఇదే ట్రెండ్ కొనసాగితే మొదటి రోజు అలాగే ప్రీమియర్స్ కలిపి 3M డాలర్స్ పైగా ఉండేలా ఉంది. ఏదేమైనా రెబల్ స్టార్ ను అందుకోవడం అంటే అంత మాములు విషయం కాదనిే చెప్పాలి.

RSS
Follow by Email
Latest news