మనందరికీ దూరమై 30 ఏళ్లు అవుతున్నా తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్థంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా అయన చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు . అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తెలుగు జాతి ఖ్యాతిని ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్లిన యుగపురుషుడు. మన ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని కొనియాడారు . పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చి… ఒక చరిత్ర కసృష్టించారు అని అన్నారు . దేశంలో సుపరిపాలనకు ఎన్టీఆర్ అర్థం చెప్పారని గుర్తు చేశారు . సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు. విద్యావంతులు, బడగులకు టెకెట్లు ఇచ్చి ఎన్నో అవకాశాలు కల్పించారు. విద్యావంతులను… మేథావులను… సమర్థులను ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చి సామాజిక న్యాయం చేశారు… తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో ముందుకెళ్లారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా పాలన చేపట్టారని కొనియాడారు.
పాలనలో సంస్కరణలు తీసుకొచ్చారు… బడుగులకు కొత్త చట్టాల తీసుకొచ్చారు. ఎన్టీఆర్ వచ్చాక రూ.2లకే కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రతకు నాంది పలికారు. తిరుమలలలో భక్తులకు అన్నదానం ప్రశేశపెట్టారు. లక్ష మందికి తిరుమలలో నిత్యం అన్నదానం జరుగుతోందని బాబు తెలిపారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చారు. తర్వాత అది దేశంలో చట్టం అయింది. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు… మహిళలకు స్థానిక సంస్థల్లో 9 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దాన్ని నేను 33 శాతం చేశానని బాబు తెలిపారు . నేడు రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్, శాసన సభల్లో 33 శాతం మహిళలకు రాబోతున్నాయి. ఇది మార్పుకు నాంది. నేడు మనం అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5 లకే అన్నం పెడుతున్నాం. అన్ని నియోజకవర్గాల్లో అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చారు. వృద్ధులకు రూ.35లతో పింఛను ప్రారంభించారు. దాన్ని నేను రూ.70 చేశాను. రూ.200 ఉంటే రూ.2000 లకు, ఇప్పుడు రూ.4 వేలకు పెంచాం. పేదలకు ఎన్టీఆర్ పక్కా ఇళ్లను ఇచ్చారు… అదే బాటలో ఇప్పుడు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పేదలతో సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.











