గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో అనుభవం ఉన్నటువంటి మిస్పా మూవీ మీడియా కంపెనీ ఇప్పుడు సినీ రంగంలోకి తాజాగా తొలి అడుగు వేసింది. ఇప్పటి వరకు మీడియా రంగంలో పాఠకులను ఎలా ఆకట్టుకుందో అలాగే ప్రేక్షకుల్ని మరింత మెప్పించడానికి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. సినీ రంగంలో కూడా తమ ప్రతిభను కనబరచడానికి ముందుకు దూసుకెళుతుంది. వారి స్వంత బ్యానర్ అయిన మిస్పా మూవీ మీడియా బ్యానర్ లో నూతన చిత్రాన్ని తెరకెక్కించనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులను కడప నగరంలో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్బంగా మిస్పా మూవీ మీడియా అధినేత చిన్న తోటి పద్మాకర్ రావు మాట్లాడుతూ… ఈమూవీలో ఇద్దరు హీరోలు, ఇద్దరు హిరోయిన్ లు ఉంటారని అన్నారు. భద్ర, చిన్నతోట పద్మాకర్ రావ్ లు హీరోలు నటించనున్నారని, వారికీ జతగా నేహా , అంజలి లు హీరోయిన్ లు గా నటించనున్నట్టు అయన తెలిపారు. త్వరలోనే సింగిల్ షెడ్యూల్ లో ఈచిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. అలాగే ఈ చిత్రానికి తానే డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నట్లు అయన వెల్లడించారు.
ఈ చిత్రానికి :
కథ మాటలు : ఉప్పలపాటి శివ
దర్శకత్వం : పద్మాకర్ రావ్ చిన్నతోట
నిర్మాత : పద్మాకర్ రావ్ చిన్నతోట , ఆర్.సువర్ణ
సినిమాటోగ్రఫీ: జాకట రమేష్
ఎడిటర్ : అమృత రాజు
హీరోస్ : భద్ర, పద్మాకర్ రావ్ చిన్నతోట
హీరోయిన్స్ : నేహా , అంజలి
విలన్ : దుంపల యల్లారెడ్డి
తదితరులున్నారు.