గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా డీసీపీలను బదిలీ చేస్తూ తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సిటీలోని నాలుగు కమిషనరేట్ల పరిధిలో పలువురు డీసీపీలు బదిలీ అయ్యారు. కొత్తగా ఏర్పాటైన జోన్లు, ఇతర విభాగాలకు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం నాలుగు కమిషనరేట్ల పరిధిలో వివిధ జోన్లకు 20 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ సౌత్ రేంజ్ అడిషనల్ కమిషనర్‌గా తస్వీర్ ఇక్బాల్, హైదరాబాద్ నార్త్ రేంజ్ జాయింట్ సీపీగా శ్వేత, కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీగా కోటిరెడ్డి, మహేశ్వరం జోన్ డీసీపీగా నారాయణరెడ్డి, సికింద్రాబాద్ జోన్ డీసీపీగా రక్షితామూర్తి, ఉప్పల్ జోన్ డీసీపీగా సురేష్, చార్మినార్ జోన్ డీసీపీగా కిరణ్ ఖరే, ఎల్బీనగర్ జోన్ డీసీపీగా అనురాధ, ఖైరతాబాద్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, గోల్కొండ జోన్ డీసీపీగా చంద్రమోహన్, జూబ్లీహిల్స్ జోన్ డీసీపీగా రమణారెడ్డి, శంషాబాద్ జోన్ డీసీపీగా రాజేష్, షాద్‌నగర్ జోన్ డీసీపీగా శిరీష్, చేవెళ్ల జోన్ డీసీపీగా యోగేష్ గౌతం, కూకట్ పల్లి జోన్ డీసీపీగా రితిరాజ్, శేర్లింగంపల్లి జోన్ డీసీపీ గా చింతమనేని శ్రీనివాస్ , బేగంపేట్ డీసీపీ గా రక్షితమూర్తి, రాజేంద్రనగర్ డీసీపీ గా శ్రీనివాస్, ఉప్పల్ జోన్ డీసీపీ గా సురేష్ బదిలీ అయ్యారు.











