హీరో విజయ్ అభిమానుల కు గుడ్ న్యూస్… ఈ రోజు తమిళ యాక్షన్ థ్రిల్లర్ ‘జన నాయగన్’ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాను తమిళ, తెలుగు రెండు భాషల్లో నిర్మిస్తున్నారు. తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో విడుదల కానుంది. విజయ్ కెరీర్‌లో చివరి చిత్రంగా భావిస్తున్న ‘జన నాయకుడు’ చిత్రం ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా పేరుకు తగ్గట్టుగానే, బలమైన రాజకీయ సందేశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ తమిళనాట పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న సందర్బంగా, తరుణంలో విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్ ఫుల్ డైలాగులు, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో ఉన్నాయని సినీవర్గాల టాక్. ఈ ట్రైలర్‌లో విజయ్ స్టైలిష్ ఎంట్రీ, తనదైన మార్క్ యాక్షన్, స్వాగ్‌తో కనిపించారు. ఆయన పలికిన డైలాగ్స్ అభిమానులను విశేషంగా అలరిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా, దర్శకుడు హెచ్.వినోత్ తెరకెక్కిస్తున్నాడు.
విజయ్ కి జతగా పూజా హెగ్డే నటిస్తుండగా, మమితబైజు, బాబీ దేఓల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే, ఇది కేవలం సినిమా మాత్రమే కాదని, ఒక బలమైన సామాజిక సందేశం ఉన్న కథ అని చెప్పక తప్పదు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.











