Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఉప్పల్ భగయత్ మెగా క్యాజిల్ అపార్ట్మెంట్ లోని గణనాధు ని నిమజ్జనం

గత ఐదు రోజులుగా పూజలందుకున్న గణనాధుడు ని ఆదివారం రోజున నిమజ్జనం చేశారు . హైదరాబాద్ ఉప్పల్ లోని భగయత్ లేఔట్ లోగల మెగా క్యాజిల్ అపార్ట్మెంట్లో వాసులంతా కలిసి అంగరంగ వైభవంగా వినాయక నిమర్జనం వేడుకలు నిర్వహించారు. అంతకు ముందు లడ్డు వేలం పాట నిర్వహించారు.

ఈ వేలం పాటలో కాలనీ వాసులు పోటీలు పడి వేలంలో పాల్గొన్నారు .  31 వేల వరకు పాడారు. చివరకు  31,500 తో కళ్యాణం రమేష్ , చంద్రకళ దంపతులు లడ్డు నీ కైవసం చేసుకున్నరు.  ఈ వేడుకల్లో ఉట్టి కొడుతూ సాంస్కృతి కార్యక్రమాలతో అపార్ట్మెంట్ వాసులు పిల్లాపాపలతో ఆనందంగా పాల్గొన్నారు .

ఈ కార్యక్రమంలో  అపార్ట్మెంట్ వాసులు రాకేష్ బండారి ,కొప్పిరాల శైల శ్రీ, రాహుల్ దివ్య, యశ్వంత్ పావని ,భాస్కర్ పావని, గోపాల్ వీణ ,రమేష్ చంద్రకళ, సృజన ,ఆదిత్య ,రవితేజ తదితరులు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news