Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ

  • ఈ రోజు మేడారానికి సర్కారు! ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ..
  • 300 మంది అధికారులకు ఏర్పాట్లు
  • భారీ భద్రత మధ్య హరిత హోటల్
  • మేడారానికి సర్కారు

తెలంగాణ సర్కారు ఈరోజు మేడారం వెళ్లనుంది. వనదేవతల సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అక్కడే కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నా రు. ఇందుకోసం ఆయా శాఖల సెక్రటరీలు, అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. సాయంత్రం అక్కడి హరిత హోటల్ లో జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో హైదరాబాద్ నగరం బయట మంత్రి మండలి సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇందుకోసం మంత్రి సీతక్క ఇవాళ (శనివారం ) ఉదయం నుంచి అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

సీఎం, మంత్రులు, వివిధశాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారు లతో కలిపి సుమారు మూడు వందల మంది అక్కడ బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 28 నుంచి వనదేవతలు సమ్మక్క, సారలమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో ఈ కేబినెట్ మీటింగ్ అక్కడ ఏర్పాటు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సీఎం పర్యటన, కేబినెట్ సమావేశం నేప థ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పా ట్లు చేశారు. మునుపెన్నడూ లేనంత భద్రను ఏర్పాటు చేశారు. సాధారణంగా రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ అవుతుంటోంది. ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ఒక మారుమూల గ్రామంలోనిర్వహించడం ఇదే తొలిసారి.

మేడారంలో జరగబోయే కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మేడారంలో శాశ్వత ప్రాతిపాదికన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం భారీగానే నిధులు కేటాయించారు. కేబినెట్ భేటీలో మరిన్ని నిధులపై ప్రకటన ఏమైనా ఉంటుందా అనే చర్చ కూడా ఉంటుంది. రైతు భోరోసా, హ్యామ్ రోడ్ల నిర్మాణం, మున్సి పల్ ఎన్నికలతో పాటు మరికొన్ని ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

RSS
Follow by Email
Latest news
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ : సీఎం చంద్రబాబు అలాంటి ఓ వ్యక్తి మళ్లీ పుట్టడు.. ఆయన ఒక్కడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..! సుందర్ స్థానంలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఛాన్స్ .. భారత ఏకైక నటుడుగా ప్రభాస్ రికార్డ్ సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు.. రష్యా, చైనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా మేము భారత్‌ కు వచ్చేది లేదు..... వేదిక మార్చాల్సిందేనంటున్న బంగ్లాదేశ్ సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేయనున్న ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌