ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల అంశంపై శనివారం (జనవరి 3) సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘‘గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయని.. వాటిని వా బనచర్ల ప్రాజెక్ట్ ఆలోచన డుకోవాలని 2015లో జరిగిన కేంద్ర జలశక్తి సమావేశంలో అప్పటి సీఎం కేసీఆర్ సలహా ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చిన సలహాతోనే ఏపీ సీఎం చంద్రబాబు బనచర్ల ప్రాజెక్ట్ ఆలోచన చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ హయాంలోనే 2016లో బనకచర్ల ప్రాజెక్ట్‌కు పునాది పడింది’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.
జల్ శక్తి శాఖ నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేసీఆర్ రెండు సార్లు వెళ్లారని.. కృష్ణా జలాల్లో ఏపీకీ 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని ఆయన ఒప్పుకున్నారని తెలిపారు. కృష్ణా ట్రైబ్యునల్ తుది తీర్పు వచ్చేవరకు ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని సంతకం పెట్టి కృష్ణా జలాల్లో తెలంగాణకు కేసీఆర్ మరణ శాసనం రాశారని విమర్శించారు. తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెట్టిన కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు.











