ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ssc వార్షిక పరీక్షల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. ఈ సంవత్సరం పరీక్షలు 2026 మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు నిర్వహించబడనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షా సెషన్స్ ఉంటాయి అని రాష్ట్ర విద్యాశాఖ తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు 5నిమిషాల ముందుగానే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలని అధికారులు తెలిపారు.
పరీక్షలకు అన్ని ఏర్పాట్లు
విద్యాశాఖ అధికారులు వెల్లడించిన విధంగా పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు, సీటింగ్, పేపర్ సెక్యూరిటీ తదితర ఏర్పాట్లను చూసుకున్నారు. విద్యార్థులకు ప్రశాంతమైన వాతావర్ణంలో పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు .
మరిన్ని వివరాల కోసం రాష్ట్ర విద్యాశాఖ వెబ్‌సైట్ లేదా సబ్-జోన్ అధికారిక నోటిఫికేషన్లను సంప్రదించవచ్చు. విద్యార్థులు సమయానికి ప్రాక్టీస్, పేపర్ మాక్ టెస్ట్స్ ద్వారా పరీక్షలకు సిద్ధం కావడం మంచిదని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు.











