వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ అంతర్జాతీయ సంస్థ వ్యవస్థాపకులు విశ్రాంత డిప్యూటీ తహసిల్దార్ మహమ్మద్ సిరాజుద్దీన్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు ఆయన బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఎగిరే శాంతికాపోతం పుస్తకావిష్కరణ జరిగింది. ప్రపంచంలో అన్ని మతాలవారు జరుపుకునేందుకు కూడా ఒక పండగ ఉండాలని అందరికీ అవసరమైన శాంతిని వస్తువుగా తీసుకొని ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక క్రొత్త పండుగను పుట్టించాలనే సంకల్పంతో వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ని స్థాపించారు.

ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ అంపశయ్య నవీన్ సీనియర్ సాహితీవేత్త గంట రామారెడ్డి ప్రొఫెసర్ బి సురేష్ లాల్ పాల్గొన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కే ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. శాంతిస్థాపనే ధ్యేయంగా కుల మతాలకతీతంగా ఆయన వినలేని సేవలను అందించారని కొనియాడారు పీస్ ఫెస్టివల్ సొసైటీ ద్వారా అనేక పాఠశాలల్లో కళాశాలలో కార్యాలయాల్లో అలాగే తదితర వేదికల్లో కూడా శాంతిస్థాపన ధ్యేయంగా పలు కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు.

ఈ కార్యక్రమాల ద్వారా వేలాది మంది విద్యార్థులు విద్యార్థులకు బాల శాంతి దూత యువ శాంతి దూత సర్టిఫికెట్లను ఇస్తూ మరోవైపు జాతీయ అంతర్జాతీయ ప్రముఖులకు భారత శాంతి దూత అవార్డులను ప్రధానం చేశారని అన్నారు.

అంతర్జాతీయ సామాజిక తత్వవేత్త సిరాజుద్దీన్ ను ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. అలాగే ఈ కార్యక్రమంలో…. సిరాజుద్దీన్ బంధుమిత్రులు వివిధ సంగీత సంస్థలు పలు సాహితీ సంస్థల సభ్యులు పాల్గొన్నారు











