ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం జీహెచ్‌ఎంసీ పరిధిని విస్తరించే తీర్మానం చేసిన సంగతి తెలిసిందే . ఈమేరకు జీహెచ్‌ఎంసీ విస్తరణకు ‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్’పై గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ దస్త్రం ప్రభుత్వానికి చేరడంతో, ఇక తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే గెజిట్ విడుదల చేయనుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) లోపల, బయట ఉన్న 27 పురపాలక సంస్థలను జీహెచ్‌ఎంసీ పరిధిలో చేర్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ విలీనానికి అనుగుణంగా జీహెచ్‌ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపాలిటీల చట్టాలలో సవరణలు చేయాలని కూడా నిర్ణయించింది.
జీహెచ్‌ఎంసీలో విలీనం కానున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు:
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా : బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, తూముకుంట, కొంపల్లి, దుండిగల్ ఈ జాబితాలో ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా :
బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్, పెద్ద అంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్, నార్సింగి, మణికొండ, ఆదిభట్ల, తుక్కుగూడ
సంగారెడ్డి జిల్లా : బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి .
ఈ విలీనంతో హైదరాబాద్ పరిపాలనా విస్తీర్ణం భారీగా పెరగనుంది, నగర అభివృద్ధి ప్రణాళికలు మరింత సమగ్రంగా అమలు చేసే అవకాశం ఉంది.











