రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ నాయకురాలు కొప్పిరాల శైలశ్రీ అన్నారు . హన్మకొండ జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సంతోష్ రెడ్డి కి ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు . ఈరోజు పార్టీ కార్యాలయంలో ఆయనను ఆమె కలిసి పుష్పగుచ్ఛము ఇచ్చారు . సంతోష్ అన్న నాయకత్వంలో పార్టీ మరింత అభివృద్ధి చెండుతుందని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు .
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై కమలం పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటిన బీజేపీ.. రాబోయే ఎన్నికల వరకు అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకున్న రాష్ట్ర బీజేపీ అధిష్టానం.. జిల్లాల వారిగా పార్టీ అధ్యక్షుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది . ఇప్పటికే, పలు జిల్లాలకు అధ్యక్షులను ఖరారు చేస్తూ.. అధికారికంగా వారి పేర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే .