బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌట్ అయింది. రచిన్ రవీంద్ర సెంచరీ చేయగా (134) పరుగులు .. కాన్వే (91), టిమ్ సౌథీ (65) అర్ధ శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు తీశారు . మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీయగా, అశ్విన్, బుమ్రా చెరో వికెట్ తీశారు.
అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో కివీస్ కు తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. 18 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు ఒక వికెట్ కోల్పోయి 72 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 35 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్ శర్మ (36), విరాట్ కోహ్లీ (0) క్రీజులో ఉన్నారు.