Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

వీక్షణం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే!

‘వీక్షణం’ : మూవీ రివ్యూ

విడుదల తేది : అక్టోబర్ 18, 2024

నటీనటులు : రామ్ కార్తీక్, కశ్వి, చిత్రం శ్రీను, నక్షత్ర నైనా, దయానంద్ రెడ్డి, సమ్మేట గాంధీ, నాగ మహేష్, షైనింగ్ ఫణి, తదితరులు

దర్శకత్వం : మనోజ్ పల్లేటి

సంగీతం : సమర్ద్ గొల్లపూడి

సినిమాటోగ్రఫీ : సాయి రామ్ ఉదయ్

ఎడిటింగ్ : జెస్విన్ ప్రభు

నిర్మాతలు : పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి

రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “వీక్షణం”. ఈ చిత్రం ఈరోజు ప్రేకిత్సకుల ముందుకు వచ్చింది .  మరీ ఈ సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం.

కథ : హైదరాబాద్‌లోన ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివసించే అర్విన్ (రామ్ కార్తీక్) ఇంజినీరింగ్ పూర్తి చేశాడు . ఇంట్లో ఖాళీగా ఉండేసరికి ఏం చేయాలో తెలీక, చుట్టుపక్కల ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకునే ఆసక్తి ఉంటుంది. అందుకోసం బైనాకులర్స్‌తో ఇరుపొరుగు వారిని గమనిస్తుంటాడు. ఈ క్రమంలో అర్విన్ ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు . ఆ అమ్మాయే నేహా (కశ్వి).  ఇక అర్విన్ అనేక ప్రయత్నాలు చేసి మొత్తానికి నేహాను కూడా ప్రేమలోకి దింపుతాడు. మరోవైపు తన ఎదురింట్లో దిగిన ఓ అమ్మాయి (బిందు నూతక్కి) రోజుకి ఒకరితో రావడం గమనిస్తాడు. వాళ్లని ఆమె దారుణంగా చంపడం చూస్తాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఈ హత్యలన్నీ ఎందుకు చేస్తోంది? దీని వల్ల ఆర్విన్ జీవితంలో ఎలాంటి పరిణ మాలు చోటుచేసుకున్నాయనేది తెలియాలంటే థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే . .

ఇక కథ విషయానికి వస్తే … థ్రిల్లర్ సినిమా అంటే ఓ టెంప్లేట్ ఉంటుంది. ఓ హంతకుడు ఉంటాడు. మనుషుల్ని చంపేస్తుంటాడు. అతడు/ఆమె అలా చంపడానికి కారణమేంటి? హీరో సదరు హంతుకుడిని ఎలా పట్టించాడు అనే పాయింట్‌తో పలు భాషల్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. ‘వీక్షణం’ కూడా దాదాపు అదే తరహాలో తీసిన మూవీ. కానీ స్టోరీ కోసం ఎంచుకున్న పాయింట్ బాగుంది.

బాల్కనీలో నిలబడి తల తుడుచుకుంటున్న ఓ అమ్మాయి.. సడన్‌గా గ్రౌండ్ ఫ్లోర్‌లోని కారుపై పడి చనిపోతుంది. ఇలా షాకింగ్ సీన్‌తో మూవీని మొదలవుతుంది. కట్ చేస్తే గేటెడ్ కమ్యూనిటీలో ఉండే హీరో, అతడికో ఇద్దరు ఫ్రెండ్స్. బైనాక్యూలర్‪‌లో చూసి తన ఇంటి పక్కనో ఉండే అమ్మాయితో ఇష్టపడటం, ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడటం ఇలా లవ్ ట్రాక్. మరోవైపు తన ఎదురింట్లో రోజుకో వ్యక్తితో ఓ అమ్మాయి రావడం, వాళ్లందరినీ చంపుతుండటం.. ఇలా మరో స్టోరీ నడుస్తుంటుంది. ఇదంతా హీరో చూస్తుంటాడు. ఆ అమ్మాయి ఎవరా అనే విషయం తెలియడంతో ఇంటర్వెల్ ట్విస్ట్ పడుతుంది.

సెకండాఫ్‌లో హత్యలు చేస్తున్న అమ్మాయి ఎవరు? అసలు ఆమె ఎందుకిలా చేస్తోంది? ఆమె లిస్టులో హీరోయిన్ ఎందుకుంది? అనే పాయింట్లని సెకండాఫ్‌లో చూపించారు. ఫస్టాప్ అంతా రొటీన్ లవ్ ట్రాక్ చూపించారు. అదేమంత పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. ఎప్పుడైతే ఇంటర్వెల్‌లో ట్విస్ట్ పడుతుందో.. సెకండాఫ్‌లో దెయ్యం కథ ఉండబోతుందా అనుకుంటాం. కానీ మనం ఊహించని విధంగా హంతకుడి విషయంలో ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఓఆర్‌డీ (ORD) అనే జబ్బు గురించి చెప్పి, చిన్నపాటి మెసేజ్‌ ఇచ్చారు. అదే టైంలో సీక్వెల్ ఉండే అవకాశముందనేలా మూవీని ముగించారు.

రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాలానే తీసినప్పటికీ సెకండాఫ్‌లో ట్విస్టులు ఆకట్టుకుంటాయి. హంతకుడి విషయంలో మనం ఊహించనది జరుగుతుంది. ఇప్పటికీ సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఓ సమస్యని స్టోరీలో బ్లెండ్ చేసిన విధానం బాగుంది. అది ప్రేక్షకులని ఆలోచింపజేస్తుంది. రెండు గంటల నిడివి కూడా ప్లస్ పాయింట్. కాకపోతే పెద్దన్న పేరు నటులు లేరు. అలానే ఫస్టాప్ అంతా కావాలనే సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది తప్పితే ఓవరాల్‌గా మూవీ గుడ్.

ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ : ఆర్విన్ అనే కుర్రాడిగా చేసిన రామ్ కార్తిక్ పాత్రకు తగ్గట్లు ఉన్నాడు. ఫస్టాప్ అంత లవర్ బాయ్‌లా, సెకండాఫ్‌లో హత్యలు కనుక్కొనే వాడిలో డిఫరెంట్ షేడ్స్ చూపించాడు. కశ్వి అయితే గ్లామర్ చూపించడానికి తప్పితే పెద్దగా స్కోప్ దొరకలేదు. కీలక పాత్రలో కనిపించిన బిందు నూతక్కి అనే అమ్మాయి పర్లేదనిపించింది. సర్‌ప్రైజింగ్ పాత్ర చేనిన నటుడు కూడా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రధారులు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం : ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయింది. హారర్ సినిమాలో ఎవరైనా భయపెడతారు కానీ థ్రిల్లర్ సినిమాలో అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ప్రేక్షకులని భయపెట్టాడు సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి.  ఎడిటింగ్  ఓకే పర్వాలేదు.

ఇక డైరెక్టర్ మనోజ్ పల్లేటి.. తను అనుకున్న పాయింట్ గురించి బాగానే రీసెర్చ్ చేసి మరీ రాసుకున్నాడు. ఒక థ్రిల్లర్ సబ్జెక్టుని మెసేజ్ తో ఊహించని క్లైమాక్స్ తో చెప్పడంలో దర్శకుడు మనోజ్ సక్సెస్ అయ్యాడు. దాన్ని సినిమాగా తీసి మెప్పించాడు. నిర్మాణ విలువలు కూడా స్థాయిగా తగ్గట్లు ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫీ చాలా నేచురల్‌గా ఉంది.  కాస్త బెటర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. పెద్దగా పేరున్న నటీనటులు లేరు. కాబట్టి ప్రేక్షకులు ఈ మూవీ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి?

తీర్పు : మొత్తంగా వీక్షణం సినిమా వరుస హత్యలు చేసే అమ్మాయిని హీరో ఎలా పట్టుకున్నాడు అనేది మిస్టరీ థ్రిల్లర్ తో ప్రేక్షకులని భయపెట్టారు .  సినిమాలో తరువాత   ఏం జరుగుతుంది అని ఆసక్తి కలిగేలా చేశారు. అక్కడక్కడా హాస్యాన్ని పంచారు. థ్రిల్లర్ సినిమాలు ఇష్టం ఉన్నవాళ్లు థియేటర్ కి వెళ్లి మరీచూడొచ్చు .

రేటింగ్: 2.75/5

REVIEWED BY : BANNA PRABHAKAR, CEO AND MD , APTS BREAKING NEWS.com 

RSS
Follow by Email
Latest news