👉 వారంలో 4 రోజుల పని.. మూడ్రోజులు సెలవు
జపాన్ ప్రభుత్వం తమ పౌరుల కోసం ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం, కుటుంబం రెండింటి మధ్య ప్రజలు సమతౌల్యాన్ని సాధించేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయాలని పేర్కొంది. ఈ విధానం అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇకనుంచి జపాన్ లో వారానికి 4 రోజుల పని.. మిగతా మూడ్రోజులు సెలవు అన్నమాట.
ఈ విధానాన్ని 2021లోనే అమలు చేయాలని జపాన్ నిర్ణయం తీసుకుంది. ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే పలు సంస్థలు దీనిని వ్యతిరేకించాయి. ఇలా చేయడం వల్ల అభివృద్ధి విషయంలో కొంత కాలానికి జపాన్ వెనుకపడే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశాయి. కేవలం 8శాతం సంస్థలే దానిని అనుసరించగా.. 7 శాతం సంస్థలు కేవలం ఒక సెలవు మాత్రమే అమలు చేశాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో అటువంటి సంస్థలు తప్పనిసరిగా మూడు రోజులు సెలవు ఇవ్వాల్సిందే.
ఇక భారత్ లోనూ ఈ విధానం ప్రవేశ పెట్టాలని దేశంలోని పలు ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నలు సమాచారం. ఇలా అయితే తమ కుటుంబాలతో ఎక్కువ టైం కేటాయించే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మన ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.