Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

“అహో విక్రమార్క” – మూవీ రివ్యూ

నటీనటులు: దేవ్ గిల్, చిత్ర శుక్ల, పోసాని కృష్ణ మురళి, సాయాజీ షిండే, ప్రవీణ్ టర్డే, తేజస్విని పండిట్.

సంగీతం : రవి బసృర్

సినిమాటోగ్రఫీ : కరం చావ్లా, గురు ప్రసాద్ ఎన్

ఎడిట‌ర్ : తమ్మిరాజు

నిర్మాతలు : ఆర్తి దేవ్ గిల్, మీహిర్ కులకర్ణి, అశ్విని కుమార్ మిశ్ర

దర్శకుడు : పేట త్రికోటి

“మగధీర”తో విలన్ గా తెలుగు సినిమాకి పరిచయమైన నటుడు దేవ్ గిల్. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లయ్యాక.. హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం రాజమౌళి వద్ద సీనియర్ అసోసియేట్ గా చాలా కాలంగా వర్క్ చేస్తున్న త్రికోటి దర్శకత్వంలో నటించిన చిత్రం “అహో విక్రమార్క”. తెలుగు, మరాఠీ, హిందీ, తమిళ భాషల్లో ఒకేరోజు  విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించింది? అనేది చూద్దాం..!!

కథ:

పుణెలోని ఓ కాలనీకి చెందిన 1200 మంది కూలీ పనికి అని వెళ్లి 25 ఏళ్ల పాటు కనిపించకుండాపోతారు. కానీ అక్కడికి వెళ్లిన వాళ్ళు ఏళ్ళు గడుస్తున్నా వెనక్కి రారు. అదే సమయంలో పూణే పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన విక్రమార్క (దేవ్ గిల్) అనుకోకుండా ఈ కేస్ ను డీల్ చేయాల్సి వస్తుంది. కరప్టెడ్ పోలీస్ అయ్యినటువంటి తాను మనిషిగా మారి ఆ పార్వతి స్లమ్ నుంచి తీసుకెళ్ళబడ్డ జనాన్ని ఎలా వెనక్కి తీసుకొస్తాడు? అసలు దండకా అనే ప్రాంతం ఏంటి దానిని రూల్ చేస్తున్న అసుర (ప్రవీణ్ టర్డే) ఎవరు? అక్కడికి జనాన్ని తీసుకెళ్లి ఏం చేస్తున్నారు? ఈ నేపథ్యంలో తన ప్రేయసి అర్చన (చిత్ర శుక్ల) పాత్ర ఏంటి? అసలు ఆ 1200 మందికి విక్రమార్కకి సంబంధం ఏమిటి? వాళ్లని విక్రమార్క కాపాడగలిగాడా? ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న సమస్యలేమిటి? అనేవి తెలియాలి అంటే “అహో విక్రమార్క” సినిమా చూడాల్సిందే .

ప్లస్ పాయింట్స్:

హీరో దేవ్ గిల్ ఇన్నేళ్లు విలన్ గా ఒక యాంగిల్ లో మాత్రమే కనిపించాడు. ఈ చిత్రంలో హీరోగా పర్వాలేదనిపించాడు. కానీ దేవ్ గిల్ ను తెరపై చూస్తున్నప్పుడల్లా కోట శ్రీనివాసరావు గుర్తొస్తుంటారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో “దేవ్ గిల్.. యాక్టింగ్ నిల్” అని చేసిన కామెంట్ పదే పదే గుర్తొస్తుంది. ఇక నటి చిత్ర శుక్ల డీసెంట్ పాత్రలో కనిపించింది. తన లుక్స్ బాగున్నాయి. ఆన్ స్క్రీన్ హీరో పక్కన సెట్ అయ్యింది. ఇంకా మెయిన్ విలన్ గా ప్రవీణ్ థార్డే వంటి నటులు కేవలం అలంకారంగా ఉండిపోయారు. ఇక మిగతా నటీనటుల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో డిజప్పాయింట్ చేసే అంశాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. స్టార్టింగ్ లో ఒకటి రెండు నిమిషాలు బాగానే ఉంది అనిపిస్తుంది కానీ అక్కడ నుంచి పరమ రొటీన్ నరేషన్ తో సినిమా కొనసాగుతుంది. అవే హీరో హీరోయిన్ ఎంట్రీ సీన్స్, సిల్లీ ప్రేమకథ లైన్ ఇంకా ఒక ప్రాంతానికి జనాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ వారిని హింసిస్తూ కనిపించే క్రూరమైన విలన్లు ఎవరైనా బయటకి పారిపోయే ప్రయత్నం చేసిన పనికి పనికిరారు అని తెలిసినా చంపెయ్యటం కేజీయఫ్ లో చూసేసాం.

ఇక హీరో క్యారక్టరైజేష్ ని చూస్తే ఒక టెంపర్, ఒక పటాస్ సినిమాలు గుర్తు రాక మానవు. ఇలా ఈ చిత్రం చాలా మాస్ సినిమాలు కలిపి కొట్టినట్టుగా అనిపిస్తుంది. దీనితో ఈ చిత్రం ఒకింత బోరింగ్ అండ్ డల్ గా అనిపిస్తుంది. ఇక ఓకే పర్లేదు అనిపించే ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ ఆడియెన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది అని చెప్పాలి. చాలా ఓవర్ సీన్స్ ని లాజిక్ లేకుండా చూపించేసారు.

సాంకేతికవర్గం :

ఇక ఈ చిత్రంలో నిర్మాణ విలువలు రిచ్ గా కనిపిస్తాయి. నిర్మాణం విషయంలో ఏమాత్రం రాజీపడలేదు. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ ను కూడా మెచ్చుకోవాలి. ఇక సంగీత దర్శకుడు రవి బసృర్ మొదలుకొని దర్శకుడి వరకు అందరూ అత్యంత పేలవమైన వర్క్ తో ఊదరగొట్టారు.  ఫైట్ సీన్స్ తప్పితే.. త్రికోటి ప్రతిభకు నిదర్శనంలా నిలిచే సన్నివేశం సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం అనేది గమనార్హం.

సంగీత దర్శకుడు రవి బసృర్  ప్రొడక్షన్ డిజైన్ కి, సినిమాలో కంటెంట్ కి అస్సలు సంబంధం ఉండదు.  ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ ను కూడా మెచ్చుకోవాలి. కట్ చేస్తే.. ప్రొడక్షన్ & ఆర్ట్ వర్క్ డిపార్టుమెంట్ల పనితీరుని ఏ ఒక్కరూ రెస్పెక్ట్ చేయలేదు. సంగీత దర్శకుడు రవి బస్రూర్ మొదలుకొని దర్శకుడి వరకు అందరూ అత్యంత పేలవమైన వర్క్ తో ఊదరగొట్టారు. కానీ కథనాన్ని అయినా కొంచెం డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయాల్సింది. నిమా అంతా చాలా వీక్ గా తాను తెరకెక్కించార

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే కోట్ల రూపాయల డబ్బును వృథా చేసి.. సినిమా తెరకించినట్లుంది. సినిమాలో అసలు సరైన కథ, కథనాలు లేవు. చాలా రొటీన్ కథాంశం, స్క్రీన్ ప్లే లతో దర్శకుడు ఈ చిత్రాన్ని నడిపించాడు. పైగా వర్కౌట్ కాని ఎమోషన్స్, సెకండాఫ్ సినిమా చూసే ఆడియెన్స్ ని నిరుత్సాహపరుస్తాయి. ప్రేక్షకుల సమయాన్ని వృథా చేసిన చిత్రం “అహో విక్రమార్క”. అనే చెప్పాలి . మొత్తంగా ఎక్కువకాలం థియేటర్లలో ఆడదని  తేలిపోయింది .

రేటింగ్: 1.5/5

REVIEWED BY : BANNA PRABHAKAR, CEO AND MD , APTS BREAKING NEWS.

RSS
Follow by Email
Latest news