Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెలంగాణాలో విద్యుత్ శాఖలో ప్రమోషన్లు

తెలంగాణాలో విద్యుత్ శాఖలో ప్రమోషన్లు ప్రక్రియ మొదలైంది . మొన్నటి వరకు ఎస్పీడీసీఎల్ లో పలువురికి ప్రమోషన్లు ఇవ్వగా తాజాగా ట్రాన్స్ కో, జెన్కో పరిధిలో పలువురికి పదోన్నతులు కల్పించారు. ఈమేరకు ట్రాన్స్ కో సీఎండీ సందీప్ కుమార్ సుల్తానియా, జెన్కో సీఎండీ రోనాల్డ్ రోస్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ట్రాన్స్ కో పరిధిలో ఇంజినీరింగ్ సర్వీసెస్ లో ఉన్న ప్రసన్న లక్ష్మికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ప్రమోషన్ ఇచ్చారు. ఆరుగురు ఎస్ఈలకు చీఫ్ ఇంజినీర్లుగా ప్రమోషన్ ఇచ్చారు . ఇక 8 మంది డీఈలకు ఎస్ఈలుగా పదోన్నతి లభించింది. అలాగే ఐదుగురు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా ప్రమోషన్ ఇచ్చారు. ఇద్దరు ఏడీఈలను డీఈలుగా ప్రమోట్ చేశారు. 17 మంది ఏడీఈలను డీఈలుగా ప్రమోట్ చేశారు. 27 మంది ఏఈలను ఏడీఈలుగా పదోన్నతి కల్పించారు. ఆరుగురు ఏఈలను ఏఈఈలుగా ప్రమోషన్ ఇచ్చారు. కాగా ఎస్ఈగా పనిచేస్తున్న నాగరాజును సీజీఎంగాపదోన్నతి కల్పించారు.

జెన్కో పరిధిలో చీఫ్ ఇంజినీర్ గా పనిచేసిన ఎన్ ఉమ, గోవింద్ రాజ్ కు డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ గా పదోన్నతి కల్పించడంతో పాటు బదిలీ చేశారు. అలాగే 14 మంది అకౌంట్స్ ఆఫీసర్లను సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించారు. 17 మంది అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లను అకౌంట్స్ ఆఫీసర్లుగా ప్రమోషన్ ఇచ్చారు. ఇదిలా ఉండగా పదోన్నతులతో పాటు పలువురికి స్థాన చలనం చేస్తూ విద్యుత్ శాఖ నిర్ణయం తీసుకుంది.

RSS
Follow by Email
Latest news