నీట్ పేపర్ లీక్ అయిందని పరీక్ష జరిగిన నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. నీట్ ఫలితాలు వచ్చిన తర్వాత నీట్ పేపర్ లీక్ అయినట్లు భారీ ఆరోపణలు వస్తున్నాయి. ఒకే సెంటర్ చాలా మంది విద్యార్థులు ర్యాంక్ సాధించడం, భారీగా మార్కులు పొందడంతో నిజంగానే నీట్ పేపర్ లీక్ అయిందా అనే అనుమానాలు వస్తున్నాయి. దీనిపై కొంత మంది విద్యార్థులు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు.
నీట్ యుజి-2024 ఫలితాల అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తో సమగ్ర విచారణ జరపాలని AYAF నాయకులూ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చారు. ఇక హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద AYAF నాయకులు నిరసన తెలిపారు. ఆ తరువాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేసారు. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా వైద్య కళాశాలల్లో విద్యార్థులకు సీట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.