ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు వచ్చాయి. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,313 ఓట్లు వచ్చాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కుమార్‌కు 29,697 ఓట్లు వచ్చాయి.
అయితే, ఇప్పటివరకు వచ్చిన తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తీన్మార్ మల్లన్నకు 18,565 ఓట్ల ఆధిక్యం లభించింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అభ్యర్థి గెలుపునకు 1,55,095 ఓట్లు రావాలి. పోలైన తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 50శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న గెలవాలంటే ఇంకా 32,282 ఓట్లు రావల్సి ఉంది.