ఏపీలో ప్రధాన పత్రిపక్షంగా జనసేన అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతుందని పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. బుధవారం తాడేపల్లి జనసేన ప్రధాన కార్యాలయంలో ఆపార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటూనే.. విపక్షంగా కూడా కొనసాగుతామని క్లారిటీ ఇచ్చారు.
ముందుగా అది ఎలా సాధ్యమో ఆలోచన చేస్తామని అన్నారు. కేంద్రంలోనూ కీలకంగా వ్యవహరించి రాష్ట్రానికి కావాల్సినవి సాధిస్తామని పేర్కొన్నారు. జనసేన ఆఫీసు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటుందని అన్నారు. అందుకు అనుగుణంగా కార్యాలయాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్‌పైనే తమ దృష్టి ఉంటుందని పేర్కొన్నారు. ఆ ఆరు అంశాలపైనే ప్రజలకు మొదట భరోసా కల్పించాలని తెలిపారు. రాష్ట్రం, ప్రజల నాభివృద్దే తన లక్ష్యం అని అన్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలకు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.