తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా, 17 లోక్‌సభ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8, బీజేపీ పార్టీ 8 , ఎఐఎంఐఎం 1 స్థానంలో గెలుచుకున్నాయి.
కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎంపీ అభ్యర్థులు :
నల్గొండ స్థానం నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి ఐదులక్షల 60వేలకు పైగా అధిక్యంతో, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి 2,22,170 ఓట్ల మెజార్టీతో, వరంగల్ లో డాక్టర్ కడియం కావ్య 2,20,339 ఓట్ల అధిక్యంతో, మహబూబాబాద్ లో బలరాం నాయక్ 3.49 లక్షల మెజార్టీ, ఖమ్మం లో రామ సహాయం రఘురాం రెడ్డి 4,67,847 ఓట్ల మెజార్టీ, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ 1,31,364 ఓట్ల మెజార్టీతో, జహీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ 46,188 ఓట్ల , నాగర్‌కర్నూలులో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి 94,414 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఇక బీజేపీ నుంచి గెలిచిన ఎంపీ అభ్యర్థులు :
మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 3,91,4753 ఓట్ల మెజార్టీ, నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ 1,09,241 ఓట్ల మెజార్టీతో, కరీంనగర్ లో బండి సంజయ్ 2,25,209 ఓట్ల మెజార్టీ , చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి 1,72,897 ఓట్ల మెజార్టీ , ఆదిలాబాద్ లో నగేష్ 90,652 ఓట్ల మెజార్టీతో, సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి 49,944 ఓట్ల మెజార్టీతో, మెదక్‌లో రఘునందన్
రావు 39,139 పైచీలుకు ఓట్ల మెజార్టీతో, మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ 4,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ఎఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ 3,38,087 ఓట్ల మెజార్టీతో గెలిచారు.