టోల్ యాజమాన్యాలు వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు భారీగా పెంచాయి. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. పెరిగిన టోల్ రేట్లు వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. టోల్ ఛార్జీలు సగటున 5 శాతం పెరిగాయి. కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒకవైపు ప్రయాణానికి రూ.5 పెంచారు. ఇక , బస్సులు, ట్రక్కులు ఒక వైపు ప్రయాణానికి 25 రూపాయలు పెరిగింది. రెండు వైపులా ప్రయాణానికి 35 రూపాయలు పెరిగాయి.
భారీ సరకు రవాణా వాహనాలకు ఒక వైపు ప్రయాణానికి 35 రూపాయలు పెరిగింది. ఇక వైపులా ప్రయాణానికి 50 రూపాయలకు పెంచారు. ఇక 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని వాహనాలకు 25 శాతం రాయితీ లభిస్తుంది. స్థానికుల నెలవారీ పాస్‌పైనా రూ.10 పెంచడంతో.. నెలవారీ పాస్ రేట్ రూ.330 నుంచి 340కి పెరిగింది. వాహనదారులకు ధరలపై ఆందోళన లేకుండా టోల్‌ప్లాజాల వద్ద బోర్డులను ఏర్పాటు చేసినట్టు నిర్వహణ సంస్థ తెలిపింది.