తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం TS ని TG గా మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా TSPSC పేరు నిTGPSC గా మార్చారు. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా పిలువబడే పేరు ఇకనుండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా మారనుంది.
ఇక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కీలక ప్రకటన చేసింది. 2024 జూన్ 9 న గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లుగా వెల్లడించింది. జూన్ 1 మధ్యాహ్నం 2 గంటల నుండి టీఎస్‌పీఎస్సీ వెబ్సైట్ లో హల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. జూన్ 9వ తేదీ ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్షకు 30 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల వద్ద గేట్లు మూసివేస్తారని అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుండి ప్రతి పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలెటర్లు అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకుంటారని తెలిపారు. ఆబ్జెక్టివ్ టైపు OMR విధానంలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. శాంపిల్ OMR షిట్ ను టీఎస్‌పీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు.